
Park Events
Stay updated on clean-ups, cultural evenings, and community meetings at Nethaji Park, MVP Colony.
Upcoming Events
Aug-15


Independence Day
Nethaji Park








Celebrate with us

Event Guidelines And FAQs
Learn how to participate safely, respect shared spaces, and support smooth event days at Nethaji Park.
🇮🇳 నేతాజీ పార్కులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 🇮🇳
విశాఖపట్నం, ఆగస్టు 15, 2026:
యంవీపీ కాలనీ, సెక్టర్ 1లోని నేతాజీ పార్కులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా 96 సంవత్సరాల వయసు కలిగిన నేతాజీ పార్కు వ్యవస్థాపక సభ్యుల్లో ఒక్కరైన శ్రీ సత్యారావు పాత్రుడు గారు జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన చేతులు మీదుగా జాతీ య పతాకావిష్కరణ జరగడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక గౌరవాన్ని, ప్రాధాన్యాన్ని తిసుకువచ్చింది.
శ్రీ పాత్రుడు గారు నేతాజీ పార్కుతో పాటు సెక్టర్ 1 సమాజంతో చాల కాలంగా అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన పాల్గొనడం ద్వారా పార్కు వ్యవస్థాపక సభ్యుల సేవలను, వారి కృషిని మరియూ పార్కు అభివృద్ధితో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్బంగా స్మరించుకోవటానికి అవకాశం దొరికింది.
ఈ కార్యక్రమానికి పెద్ది సంఖ్యలో పార్కు సభ్యులు, స్థానిక నివాసితులు మరియూ వారి కుటుంబ సభ్యులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీ య పతాకాలతో పార్కుని అలంకరించడంతో ఆహ్లాదకరమైన దేశభక్తి వాతావరణం నెలకొంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయంoతం చేయడానికి హాజరైన సభ్యులు, నివాసితులు మరియూ వారి కుటుంబ సభ్యులకు నేతాజీ పార్కు నిర్వాహణ కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
అలాగే నేతాజీ పార్కుని మరింత అభివృద్ధి చేయడం, సుందరీకరించడం, పరిశుభ్రంగా ఉంచడం వంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కలిసి పనిచేయడంక కోసo అందరూ కలసికట్టుగా సహకరించాలనని కమిటీ విజ్ఞప్తి చేసింది. ప్రసత్తు తరoతో పాటు నేతాజీ పార్కు ఒక ఆహ్లాదకరమైన, పచ్చని మరియూ స్ఫూర్తిదాయకమైన ప్రదేశంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ తమ వoతు సహకారం అందించాలి.
🌳 “నేతాజీ పార్కు – మన వారసత్వం, మన బాధ్యత, మన గర్వం.” 🌳
🇮🇳 జై హింద్! 🇮🇳
80th INDEPENDENCE DAY CELEBRATIONS AT NETHAJI PARK
Visakhapatnam, 15 August 2026:
The 80th Independence Day was celebrated with great patriotic spirit and enthusiasm at Nethaji Park, Sector 1, MVP Colony, Visakhapatnam.
The National Flag was hoisted by Sri Pathrudu Garu, aged 96 years, one of the founder members of Nethaji Park. His participation in the celebrations and the honour of hoisting the National Flag made the occasion particularly memorable and meaningful for all the residents.
Sri Pathrudu Garu’s association with the park and the Sector 1 community reflects the long history and contribution of the founding members towards the development and preservation of Nethaji Park.
A large number of residents, members and their families attended the programme and participated enthusiastically in the Independence Day celebrations. The park was decorated with the National Tricolour, creating a festive and patriotic atmosphere.
The Nethaji Park Maintenance Committee expressed its sincere gratitude to all the members and residents who attended the programme and extended their cooperation and support in making the celebrations a grand success.
The committee also appealed to all residents to continue their collective efforts towards the development, beautification, cleanliness and maintenance of Nethaji Park, so that it remains a beautiful green space and a cherished place for present and future generations.
“Nethaji Park – Our Heritage, Our Memories, Our Pride.”
Jai Hind! 🇮🇳
ఎంవిపి కాలనీ – చరిత్ర మరియు అభివృద్ధి
విశాఖపట్నం నగర అభివృద్ధిలో ఒక చారిత్రక మైలురాయి
మువ్వలవానిపాలెం కాలనీ, నేడు అందరికీ సుపరిచితమైన ఎంవిపికాలనీ (MVP Colony), విశాఖపట్నం నగర చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది.
ప్రణాళికాబద్ధమైన నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందిన ఎంవిపి కాలనీ, తన విశాలమైన రహదారులు, సెక్టార్ల వారీగా రూపొందించిన లేఅవుట్, నివాస స్థలాలు, పార్కులు, పచ్చని ప్రదేశాలు మరియు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో విశాఖపట్నం నగర అభివృద్ధికి ఒక ఆదర్శంగా నిలిచింది.
చారిత్రకంగా, ఈ ప్రాంత అభివృద్ధి 1970లలో ప్రారంభమైంది. అందుబాటులో ఉన్న న్యాయపరమైన రికార్డుల ప్రకారం, మువ్వలవానిపాలెం ప్రాంతంలో సుమారు 400 ఎకరాల భూమిని 1972లో సేకరించి, 1978లో వివిధ వర్గాల ప్రజల కోసం గృహ స్థలాల లేఅవుట్‌ను రూపొందించి ప్రకటించారు. లేఅవుట్‌లో రహదారులు, నీటి సరఫరా, డ్రైనేజీ, పార్కులు తదితర మౌలిక సదుపాయాలకు స్థానం కల్పించారు.
వుడా ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి
విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VUDA) 17 జూన్ 1978న ఏర్పడింది. అంతకు ముందు టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ నగర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేది. VUDA ఏర్పడిన తరువాత విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ లేఅవుట్లు, రహదారులు, మౌలిక వసతులు మరియు పార్కుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది.
ఈ చారిత్రక దశలో దివంగత శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారు VUDA తొలి చైర్మన్‌గా (1978–1981) వరకు బాధ్యతలు నిర్వహించారు.
ఎంవిపి కాలనీ అభివృద్ధి వెనుక ఆయన దూరదృష్టి, పట్టణ ప్రణాళికపై ఉన్న అవగాహన మరియు ప్రజలకు మెరుగైన నివాస వాతావరణాన్ని కల్పించాలనే సంకల్పం ముఖ్యమైన పాత్ర పోషించాయని స్థానికంగా గుర్తించబడింది.
ఒక విశాలమైన ప్రణాళికాబద్ధమైన నివాస సముదాయం
ఎంవిపి కాలనీ ప్రత్యేకత కేవలం పెద్ద సంఖ్యలో గృహాలు ఉండటంలోనే కాదు.
కాలనీని ప్రణాళిక రూపొందించినప్పుడు:
- విశాలమైన రహదారులు
- సెక్టార్ల వారీగా లేఅవుట్
- వివిధ ఆదాయ వర్గాలకు గృహ స్థలాలు
- పార్కులు మరియు ఓపెన్ స్పేస్‌లు
- నీటి సరఫరా
- డ్రైనేజీ వ్యవస్థ
- ప్రజా అవసరాల కోసం స్థలాలు
- పచ్చని ప్రదేశాలు
వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కారణంగానే ఎంవిపి కాలనీ కాలక్రమేణా విశాఖపట్నంలోని ప్రముఖ నివాస ప్రాంతాలలో ఒకటిగా ఎదిగింది.
పార్కులు – కాలనీకి ఊపిరితిత్తులు
MVP Colony ప్రణాళికలో పార్కులు మరియు పచ్చని ప్రదేశాలకు కూడా స్థానం కల్పించడం ఒక ముఖ్యమైన అంశం.
VUDA తన పరిధిలోని లేఅవుట్లు మరియు హౌసింగ్ కాలనీలలో పార్కులను అభివృద్ధి చేయడం తన కార్యకలాపాలలో భాగంగా చేపట్టింది. VUDA అధికారిక సమాచారం ప్రకారం, వివిధ లేఅవుట్లు మరియు హౌసింగ్ కాలనీలలో పార్కుల అభివృద్ధి దాని ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి.
అటువంటి పచ్చని ప్రదేశాలలో నేతాజీ పార్కు కూడా సెక్టార్1 ప్రజలకు ఎంతో ముఖ్యమైన సామాజిక మరియు వినోద ప్రదేశంగా ఎదిగింది.
ప్రభుత్వ సహకారంతో పార్కు అభివృద్ధి
నేతాజీ పార్కు అభివృద్ధిలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC), విశాఖపట్నం కీలక పాత్ర పోషించింది. పార్కు అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనలో GVMC అందించిన సహకారం ఎంతో ముఖ్యమైనది.
అలాగే గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారి సహకారం మరియు ప్రోత్సాహం కూడా పార్కు అభివృద్ధికి తోడ్పడింది.
GVMC అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల సహకారం, స్థానిక నివాసితుల భాగస్వామ్యం — ఈ మూడు కలిసి నేతాజీ పార్కును ఒక అందమైన, పచ్చని మరియు ప్రజలకు ఉపయోగకరమైన పార్కుగా తీర్చిదిద్దడంలో సహాయపడ్డాయి.
పార్కు అభివృద్ధికి ప్రభుత్వ సంస్థల సహకారం అందినప్పటికీ, దాని నిరంతర సంరక్షణ, తోటల నిర్వహణ, పూల మొక్కల పరిరక్షణ, చెట్ల కత్తిరింపు, పరిశుభ్రత మరియు రోజువారీ నిర్వహణలో స్థానిక నివాసితుల సహకారం కూడా ఎంతో విలువైనది.
కృతజ్ఞతలు
నేతాజీ పార్కు అభివృద్ధికి సహకరించిన GVMC, విశాఖపట్నం, అధికారులకు, సిబ్బందికి మరియు గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారికి నేతాజీ పార్కు సభ్యులు మరియు సెక్టార్1 నివాసితుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ప్రభుత్వ సహకారం – ప్రజల భాగస్వామ్యం – సమిష్టి కృషి
ఇవే నేతాజీ పార్కు అభివృద్ధికి బలమైన పునాదులు.
నేతాజీ పార్కు – చరిత్ర మరియు అభివృద్ధి
మన పార్కు – మన జ్ఞాపకాలు – మన గర్వం
నేతాజీ పార్కు, సెక్టార్1, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం స్థానిక నివాసితుల జీవితాలతో ఎన్నో సంవత్సరాలుగా ముడిపడి ఉన్న ఒక అందమైన పచ్చని ప్రదేశం. ఈ పార్కు కేవలం పచ్చదనం, పూల మొక్కలు మరియు నడక మార్గాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది సెక్టార్1లో నివసించిన అనేక కుటుంబాల బాల్య జ్ఞాపకాలు, స్నేహాలు, కుటుంబ అనుబంధాలు మరియు సామాజిక జీవనానికి ప్రతీకగా నిలిచింది.
పార్కు ఆవిర్భావం
సెక్టార్1 ఏర్పడిన కాలం నుండి ఈ ప్రాంతంలోని నివాసితులు పార్కు అభివృద్ధి మరియు సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వచ్చారు. 1985 నుండి ఈ పార్కుతో అనుబంధం కలిగిన అనేక కుటుంబాలు తమ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు నడకకు మరియు అందరూ ప్రశాంతంగా గడపడానికి ఈ ప్రదేశాన్ని ఉపయోగించుకున్నారు.
కాలక్రమేణా సెక్టార్1లో పెరిగిన పిల్లలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యను పూర్తి చేసి, ఉద్యోగాలు మరియు ఉన్నత విద్య కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు, అలాగే విదేశాలకు వెళ్లారు. అయినప్పటికీ నేతాజీ పార్కు వారి బాల్య జ్ఞాపకాలలో ఒక ముఖ్యమైన భాగంగా మిగిలిపోయింది.
పార్కు అభివృద్ధి
నివాసితుల సమిష్టి కృషి, సహకారం మరియు స్వచ్ఛంద విరాళాలతో పార్కులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి.
పార్కులో ప్రస్తుతం:
వివిధ రకాల పెద్ద చెట్లు
పుష్పించే మొక్కలు
అందమైన ల్యాండ్‌స్కేపింగ్
7 అడుగుల వెడల్పు నడక మార్గం
నడక మార్గాల వెంట ప్లాంటర్ బాక్సులు
మధ్యలో రావి చెట్టుతో కూడిన సెంట్రల్ లాన్ మరియు చుట్టూ సందర్శకుల కోసం బెంచీలు
ఓపెన్ జిమ్ పరికరాలు
పిల్లల ఆట స్థలం
బోర్‌వెల్ మరియు నీటి సౌకర్యం
విద్యుత్ దీపాల ఏర్పాటు
తూర్పు మరియు పడమర వైపుల ప్రవేశ ద్వారాలు
వార్డు కార్యాలయ భవనం
వాచ్‌మన్ గది మరియు పంప్‌హౌస్
వంటి సౌకర్యాలు ఉన్నాయి.
పచ్చదనం మరియు పుష్పించే మొక్కలు
పార్కు సుందరీకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో అకలిఫా, నందివర్ధనం, లాంటినా, పసుపు రంగు అలమండా, మందారం, సింగపూర్ ఇక్సోరా, గన్నేరు తదితర పుష్పించే మొక్కలను నాటారు.
చెట్లను క్రమం తప్పకుండా కత్తిరించడం, పచ్చికను నిర్వహించడం, మొక్కలకు నీరు అందించడం, పూల మొక్కలను సంరక్షించడం వంటి పనులు నిరంతరం కొనసాగుతున్నాయి.
ఆరోగ్యం మరియు వినోదం
పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు పెద్దలు మరియు యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించేందుకు ఉపయోగపడుతున్నాయి.
పిల్లల కోసం ఆట పరికరాలను కూడా అభివృద్ధి చేస్తూ, చిన్నారులకు సురక్షితమైన మరియు ఆనందదాయకమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి జరుగుతోంది.
నివాసితుల సహకారం
నేతాజీ పార్కు అభివృద్ధి మరియు నిర్వహణలో స్థానిక నివాసితుల సహకారం ప్రధానమైనది.
నెలవారీ నిర్వహణ చందాలు, స్వచ్ఛంద విరాళాలు మరియు వస్తు రూపంలో అందించే సహాయంతో పార్కులో:
తోటల నిర్వహణ
చెట్ల కత్తిరింపు
పూల మొక్కల సంరక్షణ
పచ్చిక నిర్వహణ
పారిశుధ్యం
నీటి సరఫరా
విద్యుత్ నిర్వహణ
కొత్త పరికరాల ఏర్పాటు
వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
పార్కు నిర్వహణ కోసం విద్యుత్ వీడ్ కట్టర్, తోట పనిముట్లు మరియు ఇతర అవసరమైన సామగ్రిని కూడా దాతల సహకారంతో సమకూర్చారు.
బెస్ట్ పార్క్ అవార్డు – 2025
నేతాజీ పార్కు అభివృద్ధి మరియు నిర్వహణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా 2025 ఆగస్టు 15న GVMC ద్వారా “బెస్ట్ పార్క్” అవార్డు లభించింది.
ఈ పురస్కారం ఒక్క వ్యక్తి లేదా ఒక్క సంస్థకు చెందినది కాదు. ఇది నివాసితులు, పార్కు సభ్యులు, దాతలు, స్వచ్ఛంద కార్యకర్తలు మరియు పార్కు నిర్వహణలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సమిష్టి కృషికి లభించిన గౌరవం.
ఒక పార్కు కంటే ఎక్కువ…
నేతాజీ పార్కు అనేది కేవలం ఒక పార్కు కాదు.
ఇక్కడ ఆడుకున్న పిల్లల బాల్యం ఉంది.
ఇక్కడ ఏర్పడిన స్నేహాలు ఉన్నాయి.
ఇక్కడ ఎన్నో కుటుంబాల జ్ఞాపకాలు ఉన్నాయి.
ఇక్కడ ఉదయం నడకలు, సాయంత్రపు సమావేశాలు ఉన్నాయి.
ఇక్కడ తరతరాలుగా కొనసాగుతున్న అనుబంధం ఉంది.
1985 నుండి 2020 వరకు సెక్టార్1లో పెరిగిన, నివసించిన ప్రతి ఒక్కరినీ ఈ జ్ఞాపకాల బంధంలోకి తిరిగి ఆహ్వానిస్తున్నాము.
మీరు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా లేదా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాలు లేదా ప్రపంచంలోని మరే ప్రాంతంలో ఉన్నా — నేతాజీ పార్కు మీ బాల్య జ్ఞాపకాలలో ఒక భాగమే.
మీ జ్ఞాపకాలను పంచుకోండి
ఈ వెబ్‌సైట్ ద్వారా మాజీ నివాసితులు మరియు స్నేహితులు:
పాత ఫోటోలు
పాత వీడియోలు
బాల్య జ్ఞాపకాలు
పాఠశాల మరియు కళాశాల స్నేహితుల వివరాలు
సెక్టార్1లోని పాత జ్ఞాపకాలు
పంచుకోవచ్చు.
అలాగే రామకృష్ణ బీచ్, కైలాసగిరి, జూ పార్కు, బీచ్ రోడ్ మరియు ఎంవిపి కాలనీ పరిసరాలతో ముడిపడిన జ్ఞాపకాలను కూడా అందరితో పంచుకోవచ్చు.
మన బాల్య జ్ఞాపకాలను భవిష్యత్ తరాలకు అందిద్దాం.
మన పార్కును కలిసి అభివృద్ధి చేద్దాం.
నేతాజీ పార్కును మన అందరి వారసత్వంగా కాపాడుకుందాం.
“నేతాజీ పార్కు – మన వారసత్వం • మన జ్ఞాపకాలు • మన స్నేహాలు • మన గర్వం”
MVP Colony – మన నివాసం
నేతాజీ పార్కు – మన జ్ఞాపకం
మన సమాజం – మన బలం
నేతాజీ పార్కు నిర్వహణ కమిటీ
సెక్టార్1, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం
