NETHAJI PARK

Our Park, Our Pride, Our Responsibility.

విశాఖపట్నం, ఆగస్టు 15, 2026:

ఎంవీపీ కాలనీ, సెక్టార్–1లోని నేతాజీ పార్కులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్కు సభ్యులు, స్థానిక నివాసితులు మరియు వారి కుటుంబ సభ్యులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ పతాకాలతో పార్కును అలంకరించడంతో ఆహ్లాదకరమైన దేశభక్తి వాతావరణం నెలకొంది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి హాజరై, తమ సహకారం అందించిన సభ్యులు, నివాసితులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ నేతాజీ పార్కు నిర్వహణ కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

Leave a comment